: హోదా మాత్రమే కాదు.. హామీలన్నీ అమలు చేయాలి: చంద్రబాబు
రాష్ట్ర విభజన సరైన పద్ధతిలో చేయలేదని, ఆంధ్రప్రదేశ్‌కి తీవ్ర అన్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక సంఘం నుంచి ఏపీకి ఎటువంటి సాయం అందలేదని పేర్కొన్నారు. 14వ ఆర్థిక సంఘం కాలపరిమితి పూర్తయిన తర్వాత కూడా రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉంటుందని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలతో సమానంగా పైకి వచ్చేవరకు ఏపీకి చేయూతనివ్వాలని తాము కేంద్రాన్ని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. కేంద్రాన్ని ప్రత్యేక హోదా మాత్రమే కాదు.. విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేయాలని కోరుతున్నట్లు ఆయన తెలిపారు.