: ఫ్రాన్స్ చర్చిలోకి చొరబడ్డ దుండగులు...బందీలలో ఒకరు హతం!
ఫ్రాన్స్ లోని ఒక చర్చిలోకి చొరబడ్డ ఇద్దరు దుండగులు అక్కడ ఉన్నవారిని బందీలుగా చేసుకున్నారు. బ్లేడ్లు, కత్తులతో వచ్చిన దుండగులు బందీలలో ఒకరిని చంపినట్లు తెలుస్తోంది. ఉత్తర ఫ్రాన్స్ లోని నార్మండి ప్రాంతంలో గల చర్చిలోకి వీరు ప్రవేశించారని పోలీసులు తెలిపారు. చర్చిలోపల ఎంతమంది ఉన్నారనే విషయం తెలియదని, ఐదారుగురిని బంధించి ఉంటారని తెలుస్తోందన్నారు. చర్చి ఉన్న ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. ఈ నేపథ్యంలో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, సమీపంలోని రోడ్లన్నింటిని మూసివేశామని, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అంబులెన్సులను అక్కడికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. కాగా, బందీలలో ఒక పాస్టర్, ఇద్దరు నన్ లు, ప్రార్థన నిమిత్తం వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లుగా లోకల్ టీవీ ఛానెల్ లో వార్తలు వచ్చినట్లు సమాచారం.