: బ్రిటన్ ప్రిన్స్ చిన్నారి జార్జిపై విమర్శలు


రాజవంశానికి చెందిన ప్రిన్స్ చిన్నారి జార్జ్ పై బ్రిటన్ కౌన్సిల్ సీనియర్ ఉద్యోగిని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బ్రిటిష్ కౌన్సిల్ గ్లోబల్ చారిటీ హెడ్ ఏంజెలా గిబన్స్ తన ఫేస్ బుక్ ఖాతాలో ఈ వ్యాఖ్యలు చేసింది. రాజవంశానికి చెందిన సంపన్నుడననే గర్వం జార్జిలో కనిపిస్తోందని.. అదే మూడేళ్ల సిరియా శరణార్ధి అయిన పిల్లాడు ఇంత గర్వంగా ఎదగగలడా? అని ప్రశ్నించింది. అయితే, ఈ వ్యాఖ్యలతో తమకు ఎటువంటి సంబంధం లేదని, అది ఆమె వ్యక్తిగతమని, దీనిపై విచారణ నిర్వహిస్తామని బ్రిటిష్ కౌన్సిల్ పేర్కొంది.

  • Loading...

More Telugu News