: ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ గా నిలిచిన అశ్విన్


టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్ లో ఇటీవల వెనుకబడిన అశ్విన్, వెస్టిండీస్ పర్యటనలో జరిగిన తొలి టెస్టులో చేసిన ప్రదర్శనతో వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ స్థానాన్ని ఆక్రమించుకున్నాడు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో వికెట్లు తీయడంలో వెనుకబడిన అశ్విన్ రెండో ఇన్నింగ్స్ లో పిచ్ పై టర్న్ ను ఉపయోగించుకుని ఏడు వికెట్లు తీసి సత్తా చాటాడు. దీంతో తొలి టెస్టులో విండీస్ జట్టు సులువుగానే తలవంచింది. బ్యాటింగ్ లో సెంచరీతో సత్తా చాటిన అశ్విన్ బౌలింగ్ లో ఏడు వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. దీంతో ఐసీసీ బెస్ట్ టెస్ట్ బౌలర్ గా నిలిచాడు. ఐసీసీ నెంబర్ వన్ ఆల్ రౌండర్ గా చాలా కాలంగా అశ్విన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బెస్టు బౌలర్ జాబితాలో రవీంద్ర జడేజా 6వ స్థానంలో నిలిచాడు. 20వ స్థానంలో ఇషాంత్ శర్మ ఉన్నాడు.

  • Loading...

More Telugu News