: దురదృష్టం... అన్నీ చెడు సంకేతాలే: విమాన అదృశ్యంపై పారికర్ నర్మగర్భ వ్యాఖ్యలు
ఐదు రోజుల క్రితం చెన్నైలోని తాంబరం ఎయిర్ బేస్ నుంచి పోర్టు బ్లెయిర్ కు బయలుదేరి, మార్గమధ్యంలో అదృశ్యమైన వాయుసేన విమానం ఆచూకీ ఎప్పటికీ తెలియకపోవచ్చన్న సంకేతాలను వెలువరుస్తూ, రక్షణ మంత్రి మనోహర్ పారికర్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. నేడు న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, విమానం అదృశ్యంపై ఇప్పటివరకూ ఎన్నో సంకేతాలు అందాయని, అవన్నీ కూడా చెడు సంకేతాలనే సూచిస్తున్నాయని స్పష్టం చేశారు. ఈ అంశంపై తుది నిర్ణయానికి వచ్చే ముందు అన్ని విషయాలనూ బేరీజు వేసుకోవాల్సి వుందని, కొన్ని తప్పుడు సంకేతాలు కూడా అందినందున, ఇప్పటికిప్పుడు తుది నిర్ణయాన్ని ప్రకటించలేమని అన్నారు. మారిషస్ నుంచి వచ్చిన 'సాగరనిధి' సేవలను అందుకోవాలా? వద్దా? అన్న విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.