: ఎప్పుడూ కనిపించని కొత్త హెయిర్‌స్టైల్‌తో అక్షయ్ లుక్ అదుర్స్
విలక్షణ పాత్రల్లో కనబడుతూ మంచి హిట్లను సొంతం చేసుకుంటోన్న బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. ఆయన అతిథి పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'డిషూం'. వరుణ్‌ధావన్, జాన్ అబ్రహం, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లు ప్రధాన తారాగణంగా ఇది రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో అక్షయ్ తానింతవరకు ఎప్పుడూ కనిపించని కొత్త గెటప్‌తో అభిమానుల ముందుకు రానున్నాడు. డిషూం మూవీ ఈనెల 29న విడుదల కానుండడంతో చిత్రం యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉంది. సినిమాకు సంబంధించిన పోస్టర్స్, వీడియో సాంగ్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ట్విట్టర్ ద్వారా మూవీలోని తన లుక్ ని తెలిపే పోస్టర్‌ను అక్షయ్‌కుమార్ విడుదల చేశాడు. దీనిలో అక్షయ్ రేసర్‌గా కనబడుతున్నాడు. కొత్త హెయిర్‌స్టైల్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు.