: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం...పుష్కర పనుల్లో అలసత్వంపై చంద్రబాబు ఆగ్రహం
ఏపీ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. పుష్కర పనుల్లో అలసత్వంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో జాప్యంపై వెంటనే నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకుంటామని, ఇకపై నామినేషన్లపై పనులు ఇవ్వొద్దని, టెండర్లకు వ్యవధి తగ్గించాలని సీఎం చంద్రబాబు సూచించారు. కాగా, కృష్ణా పుష్కరాల పనులకు కేబినెట్ ఆమోదం లభించింది. జిల్లాలో ఐఐపీఎం కేంద్రం ఏర్పాటు చేయాలని, ప్రైవేటు డాక్టర్లకు శిక్షణ ఇచ్చి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇన్ సర్వీస్ డాక్టర్లుగా నియమించాలని, రేషన్ డీలర్ల కమీషన్ క్వింటాకు రూ.20 నుంచి 70కు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.