: ముంబై రోడ్డు ప్రమాదంలో ఐదుగురు విద్యార్థుల దుర్మరణం


ముంబై-పుణె ఎక్స్ ప్రెస్ హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు దుర్మరణం చెందారు. మహారాష్ట్రలోని ముంబై-పుణె రహదారిలోని కంషెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ తెల్లవారు జామున ఈ సంఘటన జరిగింది. ఆరుగురు విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టడంతో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అందులో ఇద్దరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News