: నేను నోరెత్తని వేళ, కాంగ్రెస్ దూసుకుపోతోంది: చాన్నాళ్ల తరువాత సుబ్రహ్మణ్యస్వామి


గత కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మరోసారి తన ట్విట్టర్ ద్వారా పలకరించారు. ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్, ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలపై ప్రత్యక్ష విమర్శలు చేసి, బీజేపీ అధిష్ఠానంతో చీవాట్లు తిని, ఆపై మరెవరినీ విమర్శించకుండా ఉన్న ఆయన, తన మౌనం వల్లనే రాజ్యసభలో కాంగ్రెస్ రెచ్చిపోతోందని అన్నారు. "రాజ్యసభలో నేను నోరెత్తకుండా ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఇది యాదృచ్ఛికమా?" అని ప్రశ్నించారు. గత నెలలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం స్వామి వ్యాఖ్యలను ఖండించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News