: ఫిలింనగర్ దుర్ఘటనపై పోలీసుల నోటీసులు జారీ
హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ లో నిర్మాణంలో ఉన్న రెండంతస్తుల భవనం కూలిన సంఘటనకు సంబంధించి బంజారా హిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ అధ్యక్షుడు కె.ఎస్.రామారావు, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డికి ఈ నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల విచారణ నిమిత్తం కాంట్రాక్టర్ కొండలరావు, ఇంజనీర్ సుధాకర్ రావు హాజరయ్యారు. కాగా, ఈ దుర్ఘటనలో ఇద్దరు కూలీలు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు.