: సోమాలియా మొగదీషు ఎయిర్‌పోర్టు సమీపంలో భారీ పేలుళ్లు
సోమాలియాలోని మొగదీషు ఎయిర్‌పోర్టు సమీపంలో ఈరోజు భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 8 మంది పౌరులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మొదట కొందరు ఉగ్రవాదులు ఆత్మాహుతి కారుబాంబు దాడి జరిపారు. తరువాత మరి కొందరు ఉగ్రవాదులు అక్కడ కాల్పులకు తెగబడ్డారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఉగ్రవాదులను అణచివేయడానికి భద్రతా దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు సమాచారం. మరోవైపు దాడికి తామే బాధ్యులమని అల్-షబీబ్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.