: మల్లన్నసాగర్ భూనిర్వాసితులకు సరైన నష్టపరిహారం ఇవ్వాల్సిందే: జైపాల్‌రెడ్డి డిమాండ్
తెలంగాణ ప్రభుత్వం పోలీసులతో మల్లన్నసాగర్ ముంపు బాధితులపై లాఠీఛార్జి చేయించడాన్ని తాము ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్ లో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని, తన తీరుని మార్చుకోవాలని అన్నారు. ప్రజలు, ప్రతిపక్షాలతో సమావేశం ఏర్పరచి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశంపై చర్చించాలని ఆయన పేర్కొన్నారు. మల్లన్నసాగర్ భూనిర్వాసితులకు సరైన నష్టపరిహారం ఇవ్వాల్సిందేనని జైపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు.