: జల్లికట్టుపై నిషేధం ఎత్తివేతకు ‘సుప్రీం’ నో!
తమిళనాడు రాష్ట్రంలోని సాంప్రదాయక క్రీడ ‘జల్లికట్టు’పై నిషేధం ఎత్తివేతకు సుప్రీంకోర్టు మరోసారి ‘నో’ చెప్పింది. ఆ క్రీడపై నిషేధం ఎత్తి వేసేందుకు నిరాకరించింది. ‘జల్లికట్టు’ నిషేధంపై స్టే విధించాలంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసుపై తదుపరి విచారణను ఆగస్టు 30వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. కాగా, ప్రతి ఏడాది సంక్రాంతి పండగ మరుసటి రోజున జరిపే ఈ క్రీడపై 2011లో యూపీఏ ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ సర్కార్ ఈ క్రీడపై నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే, ఎన్డీఏ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు జంతు ప్రేమికులు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.