: కస్టమర్ల కోసం సూపర్ ఆఫర్ ప్రకటించిన అమెజాన్!


తమ అమ్మకాలను మరింతగా పెంచుకోవాలన్న ఉద్దేశంతో ఉన్న ఆన్ లైన్ విక్రయాల దిగ్గజం అమెజాన్ మరో ఆఫర్ ను ప్రకటించింది. 100కు పైగా దేశాల్లో ఈ-కామర్స్ విక్రయాలు సాగిస్తున్న సంస్థ ప్రధాన సభ్యత్వ అవకాశాన్ని కల్పిస్తూ, 'ప్రైమ్ మెంబర్ షిప్ ప్రోగ్రామ్'ను నేడు ప్రకటించింది. ఇందులో భాగంగా రూ. 499 వార్షిక చందాతో చేరితే పలు రకాల సేవలను అందుకోవచ్చని చెబుతోంది. వీరికి స్పెషల్ డీల్స్ తో పాటు, రెండు నుంచి మూడు రోజుల్లోనే కోరుకున్న ప్రొడక్టులను అందిస్తామని, కనీస కొనుగోలు నిబంధనలు ఉండవని తెలిపింది. 60 రోజుల ప్రారంభ ఉచిత ఆఫర్లు, రూ. 500 డిస్కౌంట్ ఇస్తామని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ వెల్లడించారు. ఇందులో చేరితే ఇండియాలోని 20 నగరాల్లో సేవలు పొందవచ్చని, 10 వేలకు పైగా ప్రొడక్టులపై రూ. 50 రాయితీ, అదే రోజు కోరిన సమయంలో డెలివరీ అందుకోవచ్చని వివరించారు.

  • Loading...

More Telugu News