: హరితహారం కోసం నెల రోజుల వేతనాన్ని విరాళంగా అందించిన కేటీఆర్
తెలంగాణను హరితవనంలా రూపుదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు తన నెల రోజుల వేతనాన్ని ఈరోజు ఉదయం విరాళంగా అందించారు. 3,00,116 రూపాయల చెక్‌ను రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగురామన్నకు కేటీఆర్ అందజేశారు. రాష్ట్రంలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని, మొక్కలు నాటడంతోనే ఆగకుండా వాటిని సంరక్షించే బాధ్యతను కూడా సమర్థవంతంగా చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రులు పిలుపునిచ్చారు.