: బీజేపీ సభ్యులపై కేవీపీ సభా హక్కుల ఉల్లంఘ‌న నోటీసు


భార‌తీయ జ‌న‌తాపార్టీ స‌భ్యుల‌పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావు స‌భా హ‌క్కుల ఉల్లంఘ‌న నోటీసు ఇచ్చారు. రాజ్య‌స‌భ‌లో తాను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా కోసం పెట్టిన ప్రైవేటు మెంబ‌ర్‌ బిల్లుని చ‌ర్చ‌కు రాకుండా బీజేపీ నేత‌లు ఉద్దేశ‌పూర్వ‌కంగా అడ్డుకున్నార‌ని కేవీపీ నోటీసు ఇచ్చారు. త‌మ హ‌క్కుల‌కు భంగం క‌లిగించార‌ని ఆయ‌న నోటీసులో పేర్కొన్నారు. ప్ర‌త్యేక హోదా బిల్లు వెంట‌నే చ‌ర్చ‌కు రావాల‌ని కాంగ్రెస్ రాజ్య‌స‌భ‌లో డిమాండ్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ అంశంపై రాజ్య‌స‌భ‌ డిప్యూటీ చైర్మన్‌ కురియన్ స్పందిస్తూ ప్రైవేటు బిల్లుపై ఆగస్టు 5(శుక్రవారం)వ తేదీనే చర్చించాలని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News