: ఐ లవ్యూ మిషెల్లీ.. భార్య ప్రసంగంపై ఒబామా ప్రశంసలు
డెమొక్రటిక్ పార్టీ జాతీయ సదస్సులో మిషెల్లీ ఒబామా చేసిన ప్రసంగానికి అమెరికా అధ్యక్షుడు, ఆమె భర్త బరాక్ ఒబామా మంత్రముగ్థుడైపోయారు. తమ పార్టీ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కు మద్దతు ప్రకటించాలంటూ మిషెల్లీ చేసిన ప్రసంగం అద్భుతమంటూ ఒబామా ఒక ట్వీట్ చేశారు. గొప్ప మహిళ చేసిన గొప్ప ప్రసంగమని, అమెరికా ప్రథమ పౌరురాలిగా ఉండటం ఎంతో గర్వకారణమని పేర్కొన్న ఒబామా, ‘ఐ లవ్యూ మిషెల్లీ’ అంటూ ఆ ట్వీట్ ను ముగించారు. కాగా, అమెరికా అధ్యక్షపదవికి అర్హురాలైన ఏకైక వ్యక్తి హిల్లరీ క్లింటన్ అంటూ ఆమెకు మద్దతు ప్రకటించిన మిషెల్లీ, ట్రంప్ ను తూర్పారబడుతూ చేసిన ఆ ప్రసంగానికి కరతాళ ధ్వనులు మార్మోగిపోయిన విషయం తెలిసిందే.