: తెలుగు రాష్ట్రాల్లో బలంగా నైరుతి రుతుప‌వ‌నాలు.. భారీ వ‌ర్ష సూచ‌న‌


తెలుగు రాష్ట్రాల్లోని ప‌లు చోట్ల భారీ వ‌ర్షాలు, చాలా ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు విశాఖప‌ట్నం వాతావ‌ర‌ణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాలు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బలంగా కదులుతున్నాయని, విద‌ర్భ నుంచి తెలంగాణ‌, ద‌క్షిణ కోస్తాంధ్ర మీదుగా త‌మిళ‌నాడు వ‌ర‌కు అల్ప‌పీడ‌న ద్రోణి కొన‌సాగుతోందని వీటి ప్ర‌భావంతోనే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. మ‌రో రెండు రోజుల పాటు ఇదే ప‌రిస్థితి కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News