: దైవ దూషణ చేస్తున్నాడని ముస్లిం యువ రచయితపై కేరళలో దాడి


తన కథల్లో అల్లాను దూషిస్తున్నాడని ఆరోపిస్తూ, ఓ ముస్లిం యువ రచయితపై దాడి జరిగిన ఘటన కేరళలో కలకలం రేపింది. పాలక్కాడ్ జిల్లాలోని కొట్టనాడు ప్రాంతంలో బస్సు కోసం వేచి చూస్తున్న 26 ఏళ్ల జిమ్షర్ అనే రచయితపై జాఫర్, మరో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు. జాఫర్ తాజా కలెక్షన్ 'పడచోంటే చిత్ర ప్రదర్శనం' (గాడ్స్ ఫోటో ఎగ్జిబిషన్ - పడచోన్ అంటే మలయాళంలో అల్లా) ఆగస్టు 5న విడుదల కానున్న నేపథ్యంలో ఈ దాడి జరిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. "బస్టాప్ వద్దకు వచ్చిన జాఫర్ నన్ను కాస్త దూరం తీసుకు వెళ్లాడు. అల్లాను దూషిస్తూ ఎందుకు రాస్తున్నావు? అని ప్రశ్నించాడు. ఆపై గుండెల్లో గుద్దాడు. ఆపై మరో ముగ్గురు వచ్చి దాడి చేశారు. స్థానికులు స్పందించి నన్ను ఆసుపత్రికి తరలించారు" అని జిమ్షర్ తెలిపారు. తాను ఎన్నడూ దైవ దూషణ చేయలేదని, తన తాజా పుస్తకంలో 9 పొట్టి కథలు ఉన్నాయని, ఎందులోనూ అల్లాకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలూ లేవని వివరించారు.

  • Loading...

More Telugu News