: పుష్కరాల నిర్వహణ బాధ్యతలు ఎవరెవరికి?.. కొనసాగుతున్న ఏపీ మంత్రివర్గ సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో విజయవాడలో ప్రారంభమయిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. దీనిలో ప్రధానంగా కృష్ణా పుష్కరాల ద్వారా అమరావతికి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావడంపై చర్చిస్తున్నారు. కృష్ణా పుష్కరాల నిర్వహణ బాధ్యతలు మంత్రులకి అప్పగించాలని చూస్తున్నట్లు సమాచారం. ఈనెల 29 నుంచి ప్రారంభించనున్న 'వనం-మనం' కార్యక్రమంపై కూడా మంత్రివర్గంలో చర్చిస్తున్నారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచేందుకు నిర్విరామంగా చేపట్టాల్సిన పనులను చంద్రబాబు మంత్రులకు సూచించనున్నారు.