: నాకు, నా భర్తకు బీజేపీ అన్యాయం చేసింది: పూనమ్ అజాద్


తనకు, తన భర్తకు బీజేపీ అన్యాయం చేసిందని ఎంపీ కీర్తి అజాద్ భార్య, ఆ పార్టీ అధికార ప్రతినిధి పూనమ్ అజాద్ ఆరోపించారు. తాను, భర్త కీర్తి అజాద్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతున్నారనే వార్తలపై పూనమ్ మాట్లాడుతూ, త్వరలో తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ సిద్దూ గురించి కూడా ఆమె ప్రస్తావించారు. బీజేపీ పై సిద్ధూ చేసిన ఆరోపణలు వాస్తవమేనని, అమృత్ సర్ నుంచి మూడుసార్లు ఎంపీగా ఆయన గెలిచారని, దేశ వ్యాప్తంగా పార్టీ కోసం పలుసార్లు ప్రచారం చేశారని, అటువంటి వ్యక్తిని గత ఎన్నికల్లో పక్కనపెట్టడం అన్యాయమని పూనమ్ అన్నారు. కాగా, డీడీసీఏ కుంభకోణానికి సంబంధించి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై ఎంపీ కీర్తి ఆజాద్ ఆరోపణలు చేయడంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News