: జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు
జమ్ముకశ్మీర్‌లోని నౌవ్గామ్లో ఈరోజు ఉదయం కలకలం చెలరేగింది. ఆ ప్రాంతంలోకి ప్రవేశించిన ఉగ్రవాదులే లక్ష్యంగా భద్రతా బలగాలు వారిపై కాల్పులు జరిపాయి. ఉగ్రవాదులు కూడా రెచ్చిపోయి ఎదురుకాల్పులకు దిగారు. భద్రతా బలగాలు నలుగురు ఉగ్రవాదులను అంతమొందించాయి. మరో ఉగ్రవాదిని బంధించారు. జమ్ముకశ్మీర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వానీ ఎన్ కౌంటర్ నేపథ్యంలో అక్కడ అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. పరిస్థితిని ఆసరాగా తీసుకుని ఆ రాష్ట్రంలో బీభత్స వాతావరణం సృష్టించడానికి ఉగ్రవాదులు చొరబడుతున్నారు.