: కార్గిల్ అమరవీరులను దేశం ఎప్పటికీ మర్చిపోదు: కార్గిల్ విజయ్ దివస్‌లో మోదీ
కార్గిల్ అమరవీరులను దేశం ఎప్పటికీ మర్చిపోదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కార్గిల్ విజయ్ దివస్‌ను పురస్కరించుకుని మంగళవారం ఆయన కార్గిల్ అమరులకు నివాళులు అర్పించారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశం కోసం ప్రాణాలర్పించిన ప్రతీ ఒక్కరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నట్టు మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వారి త్యాగాలు మనకు స్ఫూర్తి కావాలని ఆకాంక్షించారు. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో సైనికుల ధైర్య సాహసాలను ఈ సందర్భంగా ప్రధాని గుర్తుచేసుకున్నారు. వారి ధైర్యసాహసాలను దేశం ఎప్పటికీ మర్చిపోదన్నారు. బీజేపీ అగ్రనేత వాజ్‌పేయి నేతృత్వంలోని అప్పటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ప్రధాని ప్రశంసించారు. కార్గిల్ యుద్ధం సందర్భంగా వాజ్ పేయి వ్యవహరించిన తీరును ఆయన కొనియాడారు.