: తెలంగాణలో మూతపడ్డ 2,510 పాఠశాలలు, ఏపీలో 879


2011 నుంచి తెలంగాణలో 2,510 పాఠశాలలు మూతపడగా, గడచిన రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ లో 879 పాఠశాలలు మూతపడ్డాయని కేంద్ర మంత్రి ఉపేంద్ర కుశాహ్వ వెల్లడించారు. వైకాపా పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి లోక్ సభలో పాఠశాలల మూసివేత విషయమై ప్రశ్నించగా, కుశాహ్వ లిఖిత పూర్వక సమాధానాన్ని పంపారు. ఈ గణాంకాలు రాష్ట్ర ప్రభుత్వాలు వెల్లడించినవేనని ఆయన పేర్కొన్నారు. స్కూళ్లలో చేరుతున్న పిల్లల ఆధారంగా వాటిని హేతుబద్ధీకరించడం వల్లనే పాఠశాలలు మూతబడ్డాయని తెలిపారు. విద్యార్థులకు నష్టం కలుగకుండా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయని వెల్లడించారు.

  • Loading...

More Telugu News