: ఢాకాలో మరోమారు రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. 9 మంది ముష్కరులను మట్టుబెట్టిన పోలీసులు
బంగ్లాదేశ్‌లో మరోమారు మారణహోమం సృష్టించాలనుకున్న ఉగ్రవాదుల పన్నాగం పారలేదు. ఢాకాలో ఓ భవనాన్ని ముట్టడించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఎదురుకాల్పులు ప్రారంభించారు. రెండు గంటలపాటు జరిగిన ఎదురుకాల్పుల్లో తొమ్మిది మంది ముష్కరులు హతమైనట్టు కొద్దిసేపటి క్రితం పోలీసులు తెలిపారు. మరో ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఉగ్రవాద సంస్థ ఐఎస్‌తో వీరికి సంబంధాలు ఉండవచ్చని అనుమానిస్తున్నారు.