: తిరుమలలో చిరుత హల్ చల్
తిరుమలలో ఒక చిరుతపులి హల్ చల్ చేస్తోంది. పద్మావతి నగర్ లోని నర్సింగ్ సదన్ అతిథి గృహంలోకి చిరుత ప్రవేశించడంతో భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు, పోలీసులు అతిథిగృహం వద్దకు చేరుకుని, చిరుతను బయటకు పంపే ప్రయత్నాలు చేస్తున్నారు. అతిథి గృహానికి జేఈవో శ్రీనివాసరాజు చేరుకున్నారు. కాగా, అతిథి గృహానికి అన్ని వైపులా తలుపులను మూసేశారు. భక్తులను తమ గదుల్లోంచి బయటకు రావద్దంటూ టీటీడీ అధికారులు హెచ్చరించారు.