: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం హాంగ్ కాంగ్


ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా హాంగ్ కాంగ్ నిలిచింది. ప్రపంచంలోని 209 నగరాలపై చేసిన సర్వే ద్వారా ఈ విషయం వెల్లడైందని గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ మెర్సర్ వార్షిక రిపోర్టులో పేర్కొంది. హౌసింగ్, ఫుడ్, ఎంటర్ టైన్ మెంట్ వంటి అంశాల ధరలను పరిగణనలోకి తీసుకుని ఈ సంస్థ రిపోర్టును తయారు చేసింది. హాంకాంగ్ లో మంచి ప్రాంతంలో గృహోపకరణాలు లేని డబుల్ బెడ్ రూం అపార్ట్ మెంట్ అద్దె నెలకు 6,800 డాలర్లని (4,57,633.2 రూపాయలని) మెర్సర్ వెల్లడించింది. లండన్ లో అలాంటి డబుల్ బెడ్ రూం అపార్ట్ మెంట్ కు 4,600 డాలర్లు (3,09,575 రూపాయలు) ఖర్చు చేయాల్సి ఉంటుందని, టోక్యోలో అయితే 4,000 డాలర్లని (2,69,196 రూపాయలు) అని వెల్లడించింది. హాంకాంగ్లో ఒక కాఫీ ధర 8 డాలర్లని (538.3 రూపాయలు), అదే లండన్ లో కాఫీ 4.40 డాలర్లు, టోక్యోలో కాఫీ ధర 4.00 డాలర్లని తెలిపింది. భారీ ధరలతో హాంకాంగ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా నిలుస్తోందని మెర్సర్ రిపోర్టు తెలిపింది. హాంకాంగ్ తరువాతి స్థానాల్లో అంగోలాన్ క్యాపిటల్ లువాండా, స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్, హాంకాంగ్, సింగపూర్, టోక్యో, డెమొక్రాటిక్ రిపబ్లిక్ కాంగో క్యాపిటల్ కిన్ షాస కూడా ఈ జాబితాలో చోటు సంపాదించుకోవడం విశేషం.

  • Loading...

More Telugu News