: రాష్ట్రపతి భవన్ లో రెండో ప్రదర్శనశాలను ప్రారంభించిన ప్రధాని


రాష్ట్రపతి భవన్ లో రెండో ప్రదర్శనశాలను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ పాల్గొన్నారు. ప్రదర్శనశాలలో మాజీ రాష్ట్రపతులకు సంబంధించిన రెండు వేల కళాకృతులు, వస్తువులు, పుస్తకాలను ఉంచారు. ప్రదర్శన శాలను తిలకించేందుకు అక్టోబర్ 2 నుంచి సందర్శకులను అనుమతిస్తారు. కాగా, ఈ ప్రదర్శనశాలకు మరో ప్రత్యేకత కూడా ఉంది. భూగర్భంలో నిర్మితమైన దేశంలోని ఏకైక ప్రదర్శనశాలగా ఇది నిలిచింది.

  • Loading...

More Telugu News