: సిబ్బందితో చెప్పులు మోయించిన కలెక్టర్... మీడియాలో విమర్శలు
కొన్ని రోజులుగా ఛత్తీస్ గఢ్ లో భారీ వర్షాలు కురుస్తుండటంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలను పరిశీలించేందుకని జిల్లా కలెక్టర్ షమ్మి అబిది వెళ్లారు. ప్రజలు సమస్యలు తెలుసుకునేందుకు నదిని దాటుతూ, బురద నీటిలో నడుస్తూ ప్రయాణించాల్సిన పరిస్థితులు ఎదురుపడ్డాయి. వీటన్నింటిని దాటుకుంటూ కలెక్టర్ గారు వెళ్లడంతో ప్రజలు సంతోషపడ్డారు. ఆమెకు అధికారుల ప్రశంసలు కూడా దక్కాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ, కలెక్టర్ చెప్పులను మోస్తున్న సిబ్బంది ఆమె వెనుక నడిచి వస్తున్న ఫొటో ఒకటి ఇటీవల బయటకు వచ్చింది. ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లోకి చేరడంతో నానా విమర్శలు తలెత్తాయి. ఈ విషయమై కలెక్టర్ ను మీడియా ప్రశ్నించగా, తనకేమీ తెలియదని, బురదగా ఉందని చెప్పి తన చెప్పులు వాహనంలోనే విడిచిపెట్టానని, సిబ్బంది వాటిని చేతపట్టుకుని వచ్చారంటూ షమ్మి అబిది చెప్పుకొచ్చారు.