: ఆగస్టు నుంచే పెరిగిన జీతాలు అందుకోనున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు!


ఏడో వేతన సంఘం సూచనల ప్రకారం పెరిగిన జీతాలను వచ్చే నెల నుంచే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అందుకోనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు సమాచారం. ఈ వారాంతంలోగా ఈ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఏడో వేతన సంఘం సూచనల ప్రకారం 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 52 లక్షల మంది పింఛన్ దారులు లబ్ధి పొందనున్నారు. కాగా, ఏడో వేతన సంఘం సిఫార్సులను కేంద్ర మంత్రివర్గం జూన్ 29న ఆమోదించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News