: పుష్కరాల్లో బోట్ అంబులెన్స్ సేవలు


కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడ దుర్గాఘాట్ వద్ద రెండు బోట్ అంబులెన్సులను ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. పుష్కరాల్లో వైద్య సదుపాయాలపై ఈరోజు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పుష్కరాలకు అత్యవసర చికిత్స విధానంలో భాగంగా 12 ర్యాపిడ్ ఎమర్జెన్సీ మెడికల్ టీమ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ‘ఏ’, ‘ఏ ప్లస్’ ఘాట్ల వద్ద ప్రత్యేక వైద్య బృందాలు పనిచేస్తాయని, పుష్కర్ నగర్ లో ఆహారం పంపిణీ సందర్భంగా నాణ్యతా ప్రమాణాల పరిశీలనకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయనున్నట్లు కామినేని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News