: చైనాలో భారీ వరదలు.. 53 వేలకు పైగా ఇళ్లు నాశనం.. 150 మంది మృతి
ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో చైనాలో జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వరదలతో 53 వేలకు పైగా ఇళ్లు నాశనమయ్యాయి. వరదల ధాటికి 150 మంది ప్రాణాలు కోల్పోగా, 200 మందికిపైగా ప్రజలు వరదల్లో గల్లంతయ్యారు. కొన్ని నగరాలు పూర్తిగా నీట మునిగి జలమయమయ్యాయి. వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలకు కూడా పలుచోట్ల అంతరాయం ఏర్పడింది. వర్షాలతో నదులు పొంగుతున్నాయి. దీంతో అక్కడి హెబై, జింతై నగరాలు నీటమునిగాయి. కరెంటు స్తంభాలు, రోడ్లు, ఫ్లై ఓవర్లు నాశనమయ్యాయి. తీవ్ర ఇబ్బందులు పడుతోన్న ప్రజలని ఆర్మీ సహాయక శిబిరాలకు తరలించి, వారికి ఆహారాన్ని సరఫరా చేస్తోంది.