: విజ‌య‌న‌గ‌రం జిల్లాలో యువతిపై ప్రేమోన్మాది బ్లేడ్‌తో దాడి.. పరిస్థితి విషమం


విజ‌య‌న‌గ‌రం జిల్లా గాజులరేగ‌లో ఈరోజు దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. త‌న‌ను ప్రేమించ‌ట్లేద‌నే కార‌ణంతో ఓ యువ‌తి గొంతు కోశాడు ప్రేమోన్మాది. యువ‌తిని స్థానికులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆమె ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని డాక్ట‌ర్లు తెలిపారు. శృంగవరపుకోటకు చెందిన ఎంబీఏ విద్యార్థి కుసుమంచి విక్రమ్ ఆ యువ‌తిని పెళ్లి చేసుకుంటానంటూ 15 రోజుల క్రితం త‌న బంధువుల‌తో క‌లిసి యువ‌తి ఇంటికి వ‌చ్చాడు. అయితే విక్ర‌మ్‌తో పెళ్లికి ఆ యువ‌తి త‌ల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఈరోజు మ‌ధ్యాహ్నం ఒక్కసారిగా యువతి ఇంట్లోకి ప్ర‌వేశించిన విక్ర‌మ్ యువ‌తిని పెళ్లి చేసుకుంటానంటూ ఆమెతో వాదించాడు. దీనికి స‌ద‌రు యువ‌తి ససేమిరా అనడంతో విక్ర‌మ్ ఈ దారుణానికి ఒడిగ‌ట్టాడు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.

  • Loading...

More Telugu News