: మా భోజనంలో ఎవరో డ్రగ్స్ కలిపి ఉంటారు: సందీప్ తులసీ యాదవ్
రియో ఒలింపిక్స్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహించనున్న స్టార్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ తో పాటు డోపిగా పట్టుబడడంపై అతని రూమ్ మేట్ సందీప్ తులసీ యాదవ్ స్పందించాడు. తమపై కుట్ర జరిగిందని పేర్కొన్నాడు. తాము చేసిన భోజనంలో ఎవరో డ్రగ్ కలిపి ఉంటారని పేర్కొన్నాడు. తామేనాడు డ్రగ్స్ వినియోగించిన పాపానపోలేదని పేర్కొన్నాడు. కాగా, దీనిపై మాట్లాడిన నర్సింగ్ యాదవ్ కూడా కుట్ర జరిగిందని పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై సీబీఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశాడు. కాగా, నర్సింగ్ యాదవ్ ను కాకుండా తనను రియో ఒలింపిక్స్ కు పంపాలంటూ ఒలింపియన్ రెజ్లర్ సుశీల్ కుమార్ పోరాడిన సంగతి తెలిసిందే. నర్సింగ్ యాదవ్ కు భారత రెజ్లింగ్ సమాఖ్య మద్దతు తెలిపింది.