: 'ప‌ట్టిసీమ‌-వ‌ట్టిసీమ' అని విమర్శించిన జ‌గ‌న్ ఇప్పుడు ఏం స‌మాధానం చెబుతారు?: దేవినేని


పట్టిసీమపై వైసీపీ అధినేత‌ జగన్ వైఖరి ఏంటో ప్ర‌జ‌ల‌కి చెప్పాలని ఆంధ్ర‌ప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. ప‌ట్టిసీమ‌పై ప్ర‌తిప‌క్షం బాధ్య‌తారహితంగా మాట్లాడుతోందని మండిప‌డ్డారు. పట్టిసీమ నుంచి వచ్చిన నీటిని రోజుకు 3500 క్యూసెక్కులు కృష్ణాడెల్టాకు విడుద‌ల చేస్తున్నామ‌ని, ప‌ట్టిసీమ‌-వ‌ట్టిసీమ అని విమర్శించిన జ‌గ‌న్ ఇప్పుడు ఏం స‌మాధానం చెబుతారని ఆయ‌న అన్నారు. వైసీపీ నేత‌లు ప‌ట్టిసీమ‌పై ఉద్దేశ‌పూర్వ‌కంగానే దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని దేవినేని పేర్కొన్నారు. అక్ర‌మాల‌కు పాల్ప‌డే జ‌గ‌న్‌కు నీతులు చెప్పే నైతిక‌ హ‌క్కు ఎక్క‌డిద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. స్పీకర్ కోడెలపై వైసీపీ అధికార ప్ర‌తినిధి బొత్స‌ స‌త్య‌నారాయ‌ణ చేసిన వ్యాఖ్య‌లు స‌రికావని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News