: కుక్క పాల రుచి మరిగిన పదేళ్ల కుర్రాడు... రోజూ తాగాల్సిందే!
మనిషి చూపే ప్రేమాభిమాలకు ఎవరైనా బానిసగా మారుతారు. కానీ చిత్రంగా పదేళ్ల జార్ఖాండ్ బాలుడు కుక్కుపాలకు బానిసైన ఘటన ధన్ బాద్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...ధన్ బాద్ కు చెందిన మోహిత్ కుమార్ (10) అనే బాలుడు రెండేళ్ల వయసప్పుడు తల్లిపాలు తాగడం మానేశాడు. సాధారణంగా పాలు మానేసిన తరువాత పిల్లలు మళ్లీ అలవాటు చేసుకోరు. కానీ మోహిత్ కుమార్ మాత్రం నాలుగేళ్ల వయసప్పుడు ఎలా అలవాటు చేసుకున్నాడో కానీ వీధి కుక్కల పాలుతాగడానికి అలవాటు పడ్డాడు. వీధుల్లో ఆడుకునేందుకు వెళ్లే మోహిత్ కు చిత్రంగా కుక్కలు కూడా పాలివ్వడం మొదలుపెట్టాయి. దీంతో వాటిని తాగడం మొదలుపెట్టాడు. ఓసారి కుక్కపాలు తాగుతున్న కుమారుడిని చూసి ఆ తల్లి షాక్ కు గురైంది. అదేమి అలవాటంటూ ఆమె అతడికి రెండు తగిలించింది. అయినప్పటికీ మోహిత్ ఆ అలవాటును మానుకోలేకపోయాడు. వివిధ ఇళ్లలో పని చేసి జీవించే ఆమె చుట్టుపక్కల వారు మోహిత్ కుక్కపాలు తాగుతూ కనిపించాడని ఫిర్యాదులు చేయడంతో విసిగిపోయి కొడుకుని ఇంట్లో నిర్బంధించింది. ఇకపై అలా చేయనని తల్లిని నమ్మించడంతో రెండు వారాల కిందట అతడిని వదిలింది. దీంతో బయటకు వెళ్లిన మోహిత్... మరో వీధిలో కుక్కపాలు తాగే ప్రయత్నం చేయడంతో అది కరిచేసింది. దీంతో అతడిని ఆసుపత్రిలో చేర్చగా, కుక్కపాల వల్ల రేబిస్ వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు. అతనికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చారు. అయినప్పటికీ రేబిస్ వచ్చే ప్రమాదం ఉందని వారు తెలిపారు.