: కాసేపట్లో హైదరాబాద్ కు బాబు.. ఘన స్వాగతానికి టీడీపీ శ్రేణులు రెడీ


చారిత్రాత్మక రీతిలో 'వస్తున్నా మీకోసం' అంటూ కష్టాల కడలిలో ఈదుతున్న ప్రజలను ఊరడించి, అద్వితీయంగా పాదయాత్ర ముగించుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్నారు. 208 రోజుల అనంతరం ఆయన నగరంలో అడుగుపెడుతున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి మొదలైన బాబు పాదయాత్ర నిన్న విశాఖలో భారీ విజయస్థూపం ఆవిష్కరణతో ముగిసింది.

కాగా, పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్న బాబుకు స్వాగతం పలికేందుకు హైదరాబాద్ లోని పార్టీ శ్రేణులు సమాయత్తమయ్యాయి. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి శంషాబాద్ వరకు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించనున్నారు. బాబు విమానాశ్రయానికి చేరుకోగానే భారీ ర్యాలీతో పార్టీ ప్రధాన కార్యాలయానికి తోడ్కొని రానున్నారు.

  • Loading...

More Telugu News