: ఏపీ డీజీపీగా సాంబశివరావుకు పూర్తి స్థాయి బాధ్యతలు
ఆంధ్రప్రదేశ్ డీజీపీగా సాంబశివరావు పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు. ఏపీ డీజీపీ జేవీ రాముడు పదవీ విరమణ నేపథ్యంలో ఇన్ఛార్జ్ డీజీపీగా సాంబశివరావు బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనను పూర్తి స్థాయి డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఇప్పటికే ఆర్టీసీ ఎండీగా భాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయనకు అదనంగా ఆ బాధ్యతలను కూడా అప్పగించింది. దీంతో, ఇకపై ఆయన ఏపీ డీజీపీగా విధులతో పాటు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ బాధ్యతలను కూడా నిర్వర్తించనున్నారు. రెండు బాధ్యతలకు ఆయన న్యాయం చేస్తారని ప్రభుత్వం భావించడం విశేషం.