: ఫిల్మ్ నగర్ ఘటనపై కేటీఆర్ ఆగ్రహం... బాధ్యులపై క్రిమినల్ కేసులకు ఆదేశం!
హైదరాబాద్ ఫిల్మ్ నగర్, కల్చరల్ క్లబ్ లో నిర్మాణంలో వున్న భవనం కూలిన సంఘటనపై ఐటీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిలింనగర్ కల్చరల్ క్లబ్, ఇంజనీర్, గుత్తేదారుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, ఈ ఘటనలో ఇద్దరు శిథిలాల కిందపడి మరణించగా, మరో 8 మంది గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ అధ్యక్షుడు కెఎస్ రామారావు, ప్రధాన కార్యదర్శి రాజశేఖరరెడ్డి, భవన నిర్మాణ ఇంజనీర్ సుధాకర్ రావు, కాంట్రాక్టర్ కొండలరావుపై ఐపీసీ 304ఏ, 337, 338 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.