: నేను అసలు పుట్టినరోజే జరుపుకోను: నటుడు కైకాల సత్యనారాయణ
‘నాకు మొదటి నుంచి పుట్టినరోజు జరుపుకునే అలవాటు లేదు’ అని సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక టీవీ ఛానెల్ ఆయన నివాసంలో కైకాలతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పుట్టినరోజు నాడు ఎటువంటి ఆర్భాటాలకు వెళ్లడం తనకు అలవాటు లేదని, ఆ రోజు తలస్నానం చేసి, తన తల్లి కాళ్లకు నమస్కరించడం, దీవెనలు తీసుకోవడం, ఆమె ఇచ్చే కొత్త దుస్తులు ధరించడం, అందరితో కలిసి భోజనం చేయడం, బంధువులను కలవడం తప్పా ఎటువంటి వేడుకలు నిర్వహించడం అలవాటులేదన్నారు. పుట్టినరోజు నాడు మనం ఏమి సాధించాం, ఇంకా ఏమి సాధించాలనే విషయాన్ని గుర్తు చేసుకోవడం అలవాటని కైకాల చెప్పారు.