: సినిమా హిట్టా? ఫట్టా? అని నిర్ణయించేది వసూళ్లు కాదు!: జాన్ అబ్రహాం
ఒక సినిమా హిట్టా? ఫట్టా? అని నిర్ణయించేది వసూళ్లు కాదని బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం అన్నాడు. ముంబైలో 'డిష్యూం డిష్యూం' సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ, వసూళ్లు, స్టార్ డమ్ సినిమా సక్సెస్ అయిందా? లేదా? అన్న విషయాన్ని నిర్ణయించలేవని చెప్పాడు. ప్రేక్షకాదరణ పొందిన సినిమాకు వసూళ్లు వస్తాయని ఆయన చెప్పాడు. ట్రేడ్ విశ్లేషకులు పేర్కొనే కోట్ల వసూళ్ల గురించి సగటు ప్రేక్షకుడు పట్టించుకోడని, తనకు నచ్చిన సినిమాను ఎంజాయ్ చేస్తాడని అన్నాడు. అందుకని సినిమా ప్రేక్షకుడిని ఏమేరకు అలరించిందనే దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుందని చెప్పాడు. ఓ సినిమా విడుదల చేసిన తర్వాత చేసేందుకు ఇక ఏమీ ఉండదని చెప్పిన జాన్ అబ్రహాం, కథను అంగీకరించినప్పుడే సినిమా ఎలా ఉండబోతుందన్న విషయం ఆలోచిస్తానని చెప్పాడు. తాను జయాపజయాలను పట్టించుకోనని, వసూళ్ల గురించి అస్సలు పట్టించుకోనని అన్నాడు.