: సల్మాన్ నిర్దోషి అని చెప్పడానికి ఇరవై ఏళ్లు పట్టింది: రాంగోపాల్ వర్మ
రాజస్థాన్ హైకోర్టు ఈరోజు ఇచ్చిన తీర్పుతో వన్య ప్రాణులను వేటాడిన కేసు నుంచి కండలవీరుడు సల్మాన్ కు ఊరట లభించిన విషయం తెలిసిందే. ఈ విషయమై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో ట్వీట్ చేశారు. కేవలం సెలబ్రిటీ కేసుల్లోనే న్యాయవ్యవస్థ ఎంతటి జాప్యం చేస్తుందనే విషయం సల్మాన్ కేసు ద్వారా తెలుస్తోందన్నారు. సల్మాన్ దోషి కాదని చెప్పడానికి న్యాయవ్యవస్థకు ఇరవై సంవత్సరాలు పట్టిందంటూ వర్మ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.