: ఫ్లోరిడా నైట్ క్ల‌బ్‌లో కాల్పులకు తెగబడ్డ దుండగుడిని అరెస్ట్ చేసిన పోలీసులు


అమెరికా ఫ్లోరిడాలోని ఫోర్ట్ మయర్స్ క్ల‌బ్‌లో విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రిపిన‌ దుండ‌గుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు స‌మాచారం. కాల్పుల‌తో ర‌క్త‌సిక్త‌మ‌యిన క్ల‌బ్ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు గాయ‌ప‌డ్డ‌వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కాల్పుల ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య‌పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. కాల్పుల్లో 17 మందికి తీవ్ర‌గాయాల‌య్యాయి. చ‌నిపోయిన ఇద్ద‌రిలో ఒక‌రు 14 సంవ‌త్స‌రాల బాలుడు కూడా ఉన్నాడు. దుండగుడు మొత్తం 30 రౌండ్ల కాల్పులు జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది. ఫ్లోరిడా ఫోర్ట్‌ మెయర్స్‌లోని ‘క్లబ్‌ బ్లూ’లో ‘టీన్ నైట్’ పార్టీ జరుగుతుండ‌గా ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ పార్టీలో 13 నుంచి 15 ఏళ్ల వయసున్న బాలలు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News