: అడ్డగించిన మహిళను కత్తితో పొడిచిన చైన్ స్నాచర్... హైదరాబాద్ అమీర్ పేటలో కలకలం


తన మెడ నుంచి బంగారు ఆభరణాన్ని కాజేయబోయిన చైన్ స్నాచర్ ను ఓ మహిళ అడ్డుకున్న ఘటనలో ఆమెకు తీవ్రగాయాలు అయ్యాయి. హైదరాబాద్ అమీర్ పేటలో జరిగిన ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, ఇక్కడి కుమ్మరి బస్తీ ప్రాంతంలో నడుస్తున్న మహిళ మెడ నుంచి గొలుసును లాక్కెళ్లేందుకు ఓ యువకుడు ప్రయత్నించాడు. గొలుసు గట్టిగా ఉండటంతో అది తెగలేదు. ఈలోగా మహిళ కేకలు పెడుతూ, నలుగురినీ అలర్ట్ చేసేలోపు ఆ దుండగుడు ఆమెను కత్తితో పొడిచాడు. అప్పటికీ కేకలు పెడుతూనే దొంగను ధైర్యంగా పట్టుకుందా మహిళ. దీంతో మరోసారి ఆమెను గాయపరిచిన దొంగ, స్థానికులు వచ్చేలోపు పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు దొంగను గుర్తించేందుకు అక్కడి పలు షాపులు, రహదార్లపై ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ లను సేకరిస్తున్నారు. దుండగుడిని ధైర్యంగా ఎదుర్కొని గాయాలపాలైన బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ఆమె ధైర్యానికి ప్రశంసలు అందుతున్నాయి.

  • Loading...

More Telugu News