: మల్లన్నసాగర్‌ను నిర్మించి తీరుతాం: మహమూద్ అలీ
మల్లన్నసాగర్ అంశంలో తెలంగాణ సర్కారుపై తీవ్ర విమర్శలు వస్తోన్న నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ స్పందించారు. నల్లగొండ జిల్లా యాదాద్రిలో నిర్మించనున్న రెవెన్యూ భవన సముదాయానికి ఈరోజు శంకుస్థాపన జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని నాటకాలాడినా మల్లన్న సాగర్‌ను నిర్మించి తీరుతామని వ్యాఖ్యానించారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామ ప్రజలకు సరైన పరిహారం అందిస్తామని, 123 జీవో ప్రకారం నష్టపరిహారం ఇస్తామని, అంతేగాక ఇళ్లు కూడా నిర్మించి ఇస్తామని మహమూద్ అలీ చెప్పారు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్ట్‌ల ద్వారా మల్లన్న సాగర్‌కు నీళ్లు మళ్లించే లక్ష్యంతో తమ సర్కారు పనిచేస్తోందని, ప్రాజెక్టు పూర్తయితే 70 లక్షల ఎకరాల భూమిని సాగులోకి తీసుకురావచ్చని ఆయన పేర్కొన్నారు.