: సర్కారు వైఖరి మార్చుకోవాల్సిందే.. తెలంగాణ ప్రభుత్వంపై ప్రొ.కోదండరాం ఆగ్రహం
మల్లన్నసాగర్ భూనిర్వాసితులపై పోలీసులు చేసిన లాఠీచార్జీ పట్ల టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాల్సిందేనని అన్నారు. ప్రాజెక్టు ప్రతిపాదిత గ్రామాల్లో తెలంగాణ ప్రభుత్వం పోలీసులను మోహరించడమేంటని ఆయన ప్రశ్నించారు. లాఠీఛార్జి బాధితుల పరామర్శకు వెళుతోంటే అరెస్టు చేయడం భావ్యం కాదని ఆయన అన్నారు. నిర్వాసితులపై లాఠీఛార్జి అభ్యంతరకరం అని కోదండరాం వ్యాఖ్యానించారు. తక్షణమే ఆయా గ్రామాల నుంచి పోలీసులను వెనక్కి రప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.