: సస్పెన్స్ వీడేదెప్పుడో?... ఆప్ లో చేరికపై నోరు విప్పని సిద్ధూ!


రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కారణాన్ని వివరించిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన రాజకీయ భవిష్యత్తుపై మాత్రం నోరు విప్పలేదు. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీలో ఆయన చేరికకు సంబంధించిన సస్పెన్స్ కు నేటితో తెరపడనుందన్న వార్తలు వాస్తవ రూపం దాల్చలేదు. నేటి ఉదయం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన సిద్ధూ... రాజ్యసభకు తాను రాజీనామా చేసిన కారణాలను ఏకరువు పెట్టారు. తన సొంత రాష్ట్రం పంజాబ్ కంటే ఏ ఒక్క రాజకీయ పార్టీ తనకు ఎక్కువ కాదని ప్రకటించిన ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై మాట మాత్రంగా కూడా నోరు విప్పలేదు. దీంతో ఆప్ లో ఆయన చేరికపై మరింత కాలం సస్పెన్స్ కొనసాగేలానే ఉంది.

  • Loading...

More Telugu News