: సేఫ్ హ్యాండ్స్ లో భారత్!... మోదీ సర్కారుపై ఆరెస్సెస్ చీఫ్ కీలక వ్యాఖ్య!
ప్రధాని నరేేంద్ర మోదీ సర్కారుపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాన్పూర్ లో జరిగిన ఆరెస్సెస్ భేటీలో భాగంగా భగవత్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబందించి ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నేటి తన సంచికలో ఆసక్తికర కథనం రాసింది. మోదీ ప్రభుత్వ హయాంలో దేశం ‘సేఫ్ హ్యాండ్స్’లోనే ఉందని భగవత్ వ్యాఖ్యానించారు. మోదీ కేబినెట్ లో ఆరెస్సెస్ కు చెందిన పలువురు నేతలకు కీలక పదవులు దక్కాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు. మోదీ పనితీరు తనను ముగ్ధుడిని చేసిందని కూడా భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు.