: రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు


తెలంగాణ‌ ప్ర‌భుత్వం చేప‌డుతోన్న‌ మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు కారణంగా భూములు కోల్పోయిన వారిపై పోలీసుల లాఠీఛార్జిని ఖండిస్తూ ఈరోజు మెదక్ జిల్లాలో నిర్వ‌హిస్తోన్న బంద్‌తో ప‌లు చోట్ల ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంటోంది. జిల్లాలోని ప‌లు చోట్ల కాంగ్రెస్‌, వామ‌ప‌క్షాలు, టీడీపీ నేత‌లు ఆందోళ‌న‌కు దిగారు. గ‌జ్వేల్ వ‌ద్ద ఆందోళ‌న‌కు దిగిన‌ టీటీడీపీ నేత రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్క‌డ కాసేపు ఉద్రిక్త వాతావ‌ర‌ణం చోటుచేసుకుంది. అరెస్టు చేసిన అనంత‌రం రేవంత్ రెడ్డిని పోలీసులు దౌల్తాబాద్ పోలీస్ స్టేష‌న్‌కి త‌ర‌లించారు.

  • Loading...

More Telugu News