: కేసీఆర్ చండీయాగంతో సంతోషించా... తెలంగాణ బంగారమే: భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయుత చండీయాగాన్ని నిర్వహించడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని, ప్రజల్లో భక్తి ప్రపత్తులు పెరిగాయని మాతంగి స్వర్ణలత తన భవిష్యవాణిలో వెల్లడించారు. సికింద్రాబాద్ లష్కర్ బోనాల సందర్భంగా పచ్చి కుండపై నిలబడి, అమ్మవారిని ఆవహించుకుని భవిష్యత్తును చెప్పిన స్వర్ణలత, తెలంగాణ భవిష్యత్తు బంగారమని, ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని అన్నారు. రాష్ట్రాన్ని పచ్చగా ఉంచుతానని, తనను పూజించే వారికి ఎలాంటి కష్టాలు రానివ్వబోనని తెలిపారు.